బద్వేల్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోసన్న పంపిణీ

630చూసినవారు
బద్వేల్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోసన్న పంపిణీ
బద్వేల్ నియోజకవర్గం, పోరుమామిళ్ల మండలం, తోకలపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోసన్న పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా పెన్షన్లను అందజేశారు. ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తూ పేదల పట్ల చిత్తశుద్ధిని చాటుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్