బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కడప జిల్లా విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన సూచన జారీ చేసింది. గుర్తింపు పొందిన కళాశాలలలో మాత్రమే ఇంటర్మీడియట్ కోర్సులకు ప్రవేశం పొందాలని, అనుమతిలేని జూనియర్ కళాశాలలు లేదా కోచింగ్ సెంటర్లలో చేర్పించవద్దని కోరింది. అలాంటి సంస్థలలో చేర్పించినచో, ఆర్ఐఓ ఆఫీస్ లేదా ఇంటర్మీడియట్ విద్యా మండలి బాధ్యత వహించదని స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా, గుర్తింపు పొందిన కళాశాలల్లోనే చేర్పించాలని సూచించింది.