అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక అనూష (28) అనే వివాహిత సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఎనిమిది నెలల క్రితం ఒంటిమిట్టకు చెందిన సాయినాథరెడ్డితో వివాహమైన ఆమె, నిత్యం వేధింపులకు గురవుతూ మనస్తాపంతో విషం తాగి మృతి చెందింది. బి.కోడూరు మండలం ఐత్రంపేటకు చెందిన అనూష కేసులో ఎస్ఐ సూర్యనారాయణరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.