కడప నగరంలో గంజాయి, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం టూ టౌన్ పరిధిలోని అల్మాస్ పేట, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పారిపోవడానికి ప్రయత్నించిన అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.