కడప మున్సిపల్ హైస్కూల్‌లో ఏప్రిల్ 6 నుండి ప్రారంభం కానున్న టెన్త్ మూల్యాంకన కేంద్రంలో వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు, కూలర్లు, మజ్జిగ సౌకర్యం కల్పించాలని యూటీఎఫ్ జిల్లా శాఖ డీఈఓ షేక్ షంషుద్దీన్‌కు విన్నవించింది. వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న ఉపాధ్యాయులకు విధుల్లో మినహాయింపు ఇవ్వాలని, గత ఏడాది పెండింగ్‌లో ఉన్న రెమ్యూనరేషన్‌ను తక్షణమే చెల్లించాలని కోరింది. డీఈఓ సానుకూలంగా స్పందించి, వసతుల కల్పనలో రాజీ పడబోమని హామీ ఇచ్చారు.