పోరుమామిళ్ల పట్టణంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. గోపికృష్ణ ప్రైవేటు ఫెర్టిలైజర్ షాపులో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరానికి 50 వేల పెట్టుబడి పెట్టినా యూరియా దొరకడం లేదని, ఇది ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు షాపు యజమానులు అధిక ధరలకు యూరియా అమ్ముతున్నారని, రూ. 270 కు బదులు రూ. 500 కు అమ్మేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి, ప్రతి రైతుకు రెండు యూరియా మూటలు కూపన్ల ద్వారా ఇవ్వాలని, తగినంత స్టాక్ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రైవేటు డీలర్ల ఒత్తిడితో అధికారులు పనిచేస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు.