కడప నగరపాలక మాజీ మేయర్ పాకా సురేష్ ఇంటి ముందు సీసీ రోడ్డుపై అక్రమంగా నిర్మించిన ర్యాంపును తొలగించడంపై ఆయన సతీమణి చేసిన విమర్శలు హాస్యాస్పదమని
టీడీపీ నేత హుస్సేన్ అన్నారు. ప్రభుత్వ రోడ్డును ఆక్రమిస్తే నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ర్యాంపు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే కారణంతోనే దానిని తొలగించారని ఆయన తెలిపారు. గతంలో సచివాలయ కెమెరాలను బెడ్‌రూమ్‌కు కనెక్ట్ చేసి, ఆ స్థలాన్ని సొంత పార్కింగ్‌గా వాడుకున్న సురేష్ కుటుంబం ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని హుస్సేన్ డిమాండ్ చేశారు.