రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, వైఎస్సార్ కడప జిల్లాలోని పాత్రికేయులకు ఈ నెల 08, 09 తేదీలలో కడప సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలు ఉపయోగించుకున్నారు.