కడప నగరం ఎర్రముక్కపల్లె - విశ్వనాధపురం మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి తక్షణమే నిధులు కేటాయించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. గురువారం కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నగర కార్యదర్శి ఎ. రామమోహన్, నాయకులు నరసింహ మాట్లాడుతూ, ఇరుకైన బ్రిడ్జి కింద వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులు, మహిళలు ప్రమాదకరంగా బ్రిడ్జి పైనుంచి వెళ్తున్నారని తెలిపారు. భూసేకరణ, పరిహారం, నిధుల కేటాయింపు సమస్యలను పరిష్కరించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఫిబ్రవరి 10న రౌండ్ టేబుల్ సమావేశం, స్పందించకపోతే ఫిబ్రవరి 17 నుంచి రిలే నిరాహార దీక్షలు, మార్చి మొదటి వారం నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని సీపీఎం తెలిపింది.