వైఎస్సార్ కడప జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో శాంతి, సామరస్యం నెలకొల్పాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వేంకటపతి, డి డి సోషల్ వెల్ఫేర్ చింతామణి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి చాంద్ బాషా, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాగేశ్వరావు పాల్గొన్నారు.