జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం, లింగ ఎంపికను ప్రోత్సహించడం చట్టవిరుద్ధమని తెలిపారు. పి. సి. పి. ఎన్. డి. టి చట్ట ఉల్లంఘనలపై సమాచారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 18002332447 టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చిందని ఆయన వెల్లడించారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.