కడప నగరపాలక సంస్థ జనరల్ బాడీ, బడ్జెట్ సమావేశాలను అసెంబ్లీ సెషన్ల లోపే నిర్వహిస్తామని మేయర్ పాక సురేష్ కుమార్ తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం గత సమావేశంలోని 29 అంశాలను మినిట్స్ లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్పొరేషన్ కు రావాల్సిన రూ. 54 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ. 17 కోట్ల అమృత్ నిధులు, బీపీఎస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఎం, మంత్రులకు లేఖ రాసినట్లు మేయర్ వెల్లడించారు. క్లాప్ చార్జీల రద్దుతో రూ. 15 కోట్ల భారం పడిందని, నిధుల కొరతతో అభివృద్ధి కుంటుపడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.