కడప నగరంలోని 3వ డివిజన్ ఆచారి, జర్నలిస్ట్, పోలీస్ కాలనీలలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి భూమిపూజ చేశారు. మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, పనులను నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్, కార్పొరేటర్ మానస, ఇతర నాయకులు పాల్గొన్నారు.