కడప జిల్లాలో ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 205 మందిపై కేసులు నమోదు చేసి, రూ. 51,545 జరిమానా విధించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.