ఎర్రటి ఎండలో నాన్న పాదయాత్ర.. గుర్తు చేసుకున్న జగన్

2045చూసినవారు
ఎర్రటి ఎండలో నాన్న పాదయాత్ర.. గుర్తు చేసుకున్న జగన్
ఏప్రిల్ 9, 2003న వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేసిన పాదయాత్ర ప్రజల్లో ధైర్యం నింపిందని, రాష్ట్రమంతా మద్దతుగా నిలిచి సీఎం చేశారని జగన్ ట్వీట్ చేశారు. సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేశారని, ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపురేఖలనే మార్చేశాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్