కడప జిల్లాలో 38 మంది ఐటీఐ చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాల్లో చేరినట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండి శివశంకర్ తెలిపారు. వీరిని వెంటనే తొలగించాలని ఆయన ఆదేశించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు వంటి జిల్లాల్లో జరిగిన విచారణలో ఈ అనర్హ నియామకాలు వెలుగులోకి వచ్చాయని ఆయన స్పష్టం చేశారు.