తిరుపాలయ్య మృతికి కడప డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి సంతాపం

738చూసినవారు
తిరుపాలయ్య మృతికి కడప డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి సంతాపం
బద్వేలు మున్సిపాలిటీ 28వ వార్డు చెన్నంపల్లె వాస్తవ్యులు, రిటైర్డ్ హెడ్మాస్టర్ శ్రీ గుర్రాల తిరుపాలయ్య అనారోగ్యంతో నిన్న స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కడప డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గారు, వారి పార్థీవ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్, బద్వేల్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు కొంకుల రాంబాబు, జయరామిరెడ్డి, అరవ శ్రీనివాస రెడ్డి, డిష్ ప్రతాప్, అశోక్ రాజు మరియు బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్