కడప ఎర్రముక్కపల్లెలో దళిత మాజీ సైనికుడి ఇల్లు కూల్చివేతపై ఈ నెల 7 నుంచి చేపట్టాల్సిన రిలే దీక్షలకు పోలీసులు అనుమతి నిరాకరించడం దారుణమని సీపీఐ నగర కార్యదర్శి ఎన్. వెంకట శివ ఒక ప్రకటనలో మండిపడ్డారు. అర్ధరాత్రి ఇల్లు కూల్చినప్పుడు గుర్తురాని చట్టాలు, శాంతియుత నిరసనకు అడ్డురావడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు అనుమతి ఇవ్వలేదని, దీనిపై కలెక్టర్, ఎస్పీ తక్షణం స్పందించి అనుమతి ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.