కడప 15వ డివిజన్ లో నూతనంగా నిర్మించిన పుట్లంపల్లి చెరువు కట్ట రోడ్డును
టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ప్రజల రవాణా సౌకర్యార్థం, మెరుగైన రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.