కడప: ఎవరినీ హౌస్ అరెస్ట్ చేయలేదు: కడప ఇంచార్జ్ డీఎస్పీ

1277చూసినవారు
కడప: ఎవరినీ హౌస్ అరెస్ట్ చేయలేదు: కడప ఇంచార్జ్ డీఎస్పీ
కడప నగరంలో రాజకీయ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఇంచార్జ్ డీఎస్పీ ఇ. బాలస్వామి రెడ్డి ఖండించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే పోలీసుల ముందస్తు చర్యలు ఉన్నాయని, తాము ఎవరినీ నిర్బంధించలేదని బుధవారం ఆయన స్పష్టం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఒక కేసులో కోర్టుకు కూడా హాజరయ్యారని, తప్పుడు కథనాలు ప్రసారం చేయడం సరికాదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్