
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తడోరా గ్రామ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




