కడప: పేపర్ కే పరిమితమైన బిఈడి కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి

50చూసినవారు
కడప: పేపర్ కే పరిమితమైన బిఈడి కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి
కడప జిల్లాలో బి.ఈ.డి కళాశాలలో పర్మిషన్ తీసుకోని ఎక్కడ కనిపించడం లేదని వాటి గుర్తింపులు రద్దు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నందు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోడూరు మల్లికార్జున మాట్లాడుతూ యూనివర్సిటీ నుండి బి.ఈ.డి కళాశాల అనుమతులు తీసుకోని విద్యార్థుల నుండి లక్షల్లో వసూలు చేస్తున్నారన్నారు.