మహాకవి పుట్టపర్తికి కడప ఎస్పీ నివాళి

3చూసినవారు
మహాకవి పుట్టపర్తికి కడప ఎస్పీ నివాళి
మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ శనివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 'శివతాండవం' సృష్టికర్తగా, బహుభాషా కోవిదుడిగా సాహిత్యాకాశంలో పుట్టపర్తి ధ్రువతారగా నిలిచారని ఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ప్రకాష్ బాబు, రమణయ్య తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్