ప్రజా ఉద్యమాలకు నిధుల సేకరణలో భాగంగా, సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం కడప నగరంలోని 14వ డివిజన్ అంబేద్కర్ నగర్‌లో ఇంటింటి విరాళాల సేకరణ చేపట్టారు. కమ్యూనిస్టు పార్టీలు ప్రజల విశ్వాసంపైనే ఆధారపడతాయని, కార్మికులు, రైతుల హక్కుల సాధనకు చేసే పోరాటాలకు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందించి బలాన్నివ్వాలని నగర కార్యదర్శి ఎన్. వెంకట శివ పిలుపునిచ్చారు.