మద్యంబాబులపై కడప ట్రాఫిక్ పోలీసుల కొరడా

649చూసినవారు
మద్యంబాబులపై కడప ట్రాఫిక్ పోలీసుల కొరడా
రోడ్డు ప్రమాదాల నివారణకు కడప నగరంలో పోలీసులు మంగళవారం రాత్రి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సీఐ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్