కడప: పన్ను వసూళ్ల పేరుతో వేధిస్తే ఉద్యమిస్తాం

927చూసినవారు
కడప: పన్ను వసూళ్ల పేరుతో వేధిస్తే ఉద్యమిస్తాం
కడప నగర ప్రజలను ఇంటి పన్ను వసూళ్ల పేరుతో ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ మేయర్ సురేశ్ నగర పాలక అధికారులను హెచ్చరించారు. శనివారం కడప వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంస్థల నుంచి నగరపాలక సంస్థకు రావాల్సిన రూ. 72 కోట్ల బకాయిలను ముందుగా రాబట్టాలని డిమాండ్ చేశారు. సామాన్యులను పన్నుల కోసం వేధిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్