కడప నగరంలోని వినాయక నగర్‌లో బుధవారం, 10వ తేదీన కంపచెట్లలో మృత శిశువు బయటపడింది. సింహాద్రిపురానికి చెందిన దివ్య ప్రసవ సమయంలో పక్షవాతం రావడంతో శిశువు గర్భంలోనే మృతి చెందింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి శిశువును బయటకు తీయగా, మృతదేహాన్ని కంపచెట్లలో వదిలివెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి నిర్లక్ష్యం అనుమానాలకు తావిచ్చింది.