ప్రొద్దుటూరు పట్టణం రాజీవ్ సర్కిల్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడపకు చెందిన మహబూబ్ హుస్సేన్ (51) మృతి చెందారు. ట్రాఫిక్ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.