బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం బ్రాహ్మణ పల్లె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి, MGNREGA చట్టాన్ని అమలు చేయాలని, విబి జీ రామ్ జి చట్టాన్ని వద్దని కోరారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద కేంద్రం 90%, రాష్ట్రం 10% నిధులు ఇస్తుందని, దీనివల్ల కూలీలకు పనితో పాటు వారి సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి వస్తుందని ఆమె తెలిపారు. విబి జీ రామ్ జి చట్టం వస్తే కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు ఇవ్వాల్సి వస్తుందని, దీనివల్ల రాష్ట్రాలు రుణభారంతో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో సంతకాలు సేకరించి తీర్మానించారు.