కడపలో అర్ధరాత్రి అరాచకం - ఎమ్మెల్యే అనుచరుల పనే: అఖిలపక్షం

1203చూసినవారు
కడపలో అర్ధరాత్రి అరాచకం - ఎమ్మెల్యే అనుచరుల పనే: అఖిలపక్షం
కడప ఎర్రముక్కపల్లి కందిపాలెంలో దళిత కుటుంబం ఇంటిని అర్ధరాత్రి కూల్చివేయడంపై అఖిలపక్షం తీవ్రంగా స్పందించింది. ఇది ఎమ్మెల్యే అనుచరుల పనేనని, పోలీసుల అండతో గంజాయి బ్యాచ్ ఈ దుశ్చర్యకు పాల్పడిందని సీపీఐ నేత గాలి చంద్ర ఆరోపించారు. బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్ బంధువుల ఇళ్లను 100 మంది రౌడీలు ధ్వంసం చేశారని, నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్