పోరుమామిళ్ల మండలం కాలువకట్ట తిరుమలగిరిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి 12వ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఆయన సతీమణి తులసమ్మ స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు వారికి ఘన స్వాగతం పలికి, శాంతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసే అవకాశం కల్పించారు. స్వామివారి దర్శనం అనంతరం దంపతులకు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేసి, పూలమాలలు, శాలువాలతో సత్కరించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు, రాష్ట్ర డాక్టర్స్ విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి తులసి సురేష్, నారాయణ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.