విద్యార్థులకు ‘అపార్’తో బహుళ ప్రయోజనాలు: వీసీ రాజశేఖర్

819చూసినవారు
విద్యార్థులకు ‘అపార్’తో బహుళ ప్రయోజనాలు: వీసీ రాజశేఖర్
కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో బుధవారం 'అపార్' క్రెడిట్ సీడింగ్‌పై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ, ఎన్ఈపీ-2020లో భాగంగా విద్యార్థుల విద్యా రికార్డుల నిర్వహణ, పారదర్శకతలో 'అపార్' కీలకమని తెలిపారు. 'వన్ నేషన్ వన్ ఐడి' ప్రాముఖ్యతను ఏపీ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్‌ పర్సన్ రత్న షీలా వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పద్మ, డిజిటల్ ఇండియా ప్రతినిధి రవి పాండే పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్