ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా కడప ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. సంఘం ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్ఐసీలో విదేశీ కంపెనీల ప్రవేశం, వాటాల అమ్మకం ఆపాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అక్బర్, వారిజాతమ్మ తదితరులు పాల్గొన్నారు.