బద్వేల్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: రితేష్ రెడ్డి స్వయంగా అందజేశారు

657చూసినవారు
బద్వేల్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: రితేష్ రెడ్డి స్వయంగా అందజేశారు
బద్వేల్ నియోజకవర్గం, గోపవరం మండలం, చిన్న పోలుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ శ్రీ కే. రితేష్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి రితేష్ రెడ్డి స్వయంగా పెన్షన్లను అందజేశారు. ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తూ పేద ప్రజల పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని చాటుకున్నారని, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్