వైఎస్సార్ కడపలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో స్పెషల్ ఫీజులను వెంటనే రద్దు చేయాలని, పేద విద్యార్థులపై అదనపు భారం మోపడం అన్యాయమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న డిమాండ్ చేశారు. సైన్స్, ఆర్ట్స్, ఒకేషనల్ విద్యార్థుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఖాళీగా ఉన్న రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.