గండిక్షేత్రం ఆలయంలోని గర్భగుడిలో శ్రీవీరాంజనేయ స్వామి ఫోటోలు, వీడియోలు తీయడాన్ని అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ నిషేధించారు. దేవదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ ఆలయంలోనూ ప్రధాన విగ్రహాల ఫోటోలు, వీడియోలు షూట్ చేయకూడదని దేవదాయ శాఖ కమిషనర్ బుధవారంఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన గండిక్షేత్రంలోనూ అమల్లోకి తెచ్చారు. ఈ చర్య భక్తుల మనోభావాలను గౌరవించేందుకు, ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఉద్దేశించబడింది.