కడపలో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల కొరడా

1209చూసినవారు
కడపలో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల కొరడా
కడప నగరంలో మంగళవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సి.ఐ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సి.ఐ సురేష్ రెడ్డి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్