15 ఏళ్లుగా భూమి కోసం పేదవాడి పోరాటం: అధికారుల చుట్టూ ప్రదక్షిణలు

597చూసినవారు
15 ఏళ్లుగా భూమి కోసం పేదవాడి పోరాటం: అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణానికి చెందిన మద్దు గప్రసాద్, తన తండ్రి రామస్వామికి చెందిన రంగ సముద్రం గ్రామ రెవెన్యూ పొలంలో సర్వే నెంబర్ 1296-2లో ఖాతా నెంబర్ 785లో ఉన్న 5.05 ఎకరాల పట్టా భూమిని ఆక్రమణదారుడి నుండి తనకు ఇప్పించాలని 15 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. తన తండ్రి మరణానంతరం భూమిని తన పేరున ఆన్ లైన్, రెవెన్యూ రికార్డులలో మార్చమని అనేక అర్జీలు సమర్పించినా అధికారులు పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు. ఈ నేపథ్యంలో, గాజులపల్లి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఆ భూమిని ఆక్రమించి దున్నుతున్నాడని, ప్రశ్నిస్తే అది తన సొంతమని చెబుతున్నాడని ప్రసాద్ తెలిపారు. తహశీల్దార్, సర్వేయర్, విఆర్వోలు విచారించినా, ఆర్డిఓ కూడా జోక్యం చేసుకున్నా సమస్య పరిష్కారం కాలేదని, ఆన్ లైన్ లో ఇప్పటికీ రామస్వామి పేరు మీదే భూమి ఉన్నా భాస్కర్ రెడ్డి ఆక్రమించాడని, న్యాయం చేయాలని ప్రసాద్ కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్