కడప సెకండ్ శనివారం పేరుతో గంటల తరబడి విద్యుత్ కోత

668చూసినవారు
కడప సెకండ్ శనివారం పేరుతో గంటల తరబడి విద్యుత్ కోత
సెకండ్ శనివారం కారణంగా ఉదయం 8 గంటలకు నిలిపివేసిన విద్యుత్ సరఫరా, సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకు పునరుద్ధరించాల్సి ఉండగా, మధ్యాహ్నం 1:40 గంటలు దాటినా ఇంకా పునరుద్ధరించకపోవడం ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది. ఈ నిర్లక్ష్య వైఖరిపై స్థానిక యువకుడు రెడ్డిసాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆలస్యానికి గల కారణాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్