మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయవాడ ACB కోర్టు ఊరటనిచ్చింది. ఆయన ఇకపై ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయంలో సంతకం చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, పాస్‌పోర్ట్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీనికోసం రూ. లక్ష డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బెయిల్ పిటిషన్‌పై విధించిన ఆంక్షలను కోర్టు సడలించింది.