బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ, వ్యవసాయ ఉప మార్కెటింగ్ సంచాలకులు శ్రీమతి లావణ్య మేడంను కలిసి, పోరుమామిళ్లలో ఉన్న ఉప మార్కెట్ యార్డ్ ను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించి, త్వరగా పూర్తి అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పోరుమామిళ్ల కేంద్రంగా రైతు బజార్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కూడా ఆమెను కోరారు.