వైఎస్సార్ కడప జిల్లా, కడపలో శనివారం మధ్యాహ్నం అనారోగ్యంతో విశ్రాంత ఉద్యోగి మస్తాన్ సాహెబ్ తుదిశ్వాస విడిచారు. సమాచార పౌర సంబంధాల శాఖ డివిజనల్ పీఆర్ఓగా ఆయన దీర్ఘకాలం విధులు నిర్వర్తించారు. ఆయన మృతి పట్ల సమాచార పౌర సంబంధాల శాఖ కడప ఆర్జేడీ వెంకటేశ్వర ప్రసాద్, సహాయ సంచాలకులు రమేష్, శాఖ ఉద్యోగులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మస్తాన్ సాహెబ్ తన సర్వీసు కాలంలో పాత్రికేయ మిత్రులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ శాఖకు మంచి గుర్తింపు తెచ్చారని తెలిపారు. ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.