కడప కలెక్టరేట్‌లో మంగళవారం, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మైనింగ్ క్వారీలు, ప్రధాన ఖనిజ బ్లాకుల కార్యాచరణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖనిజ నిక్షేపాలను ఆర్థిక వనరుగా వినియోగించుకోవడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గనులకు ప్రభుత్వ అనుమతులు, నిబంధనలు, భద్రతా ప్రమాణాల పాటించడం, వార్షిక ఆదాయం వంటి అంశాలపై సమీక్షించారు.