ఆర్ఎస్ఎఫ్ నాయకులు ఆర్ఐఓపై అవినీతి ఆరోపణలు, సస్పెండ్ చేయాలని డిమాండ్

481చూసినవారు
ఆర్ఎస్ఎఫ్ నాయకులు ఆర్ఐఓపై అవినీతి ఆరోపణలు, సస్పెండ్ చేయాలని డిమాండ్
వైఎస్సార్‌ కడప జిల్లా కలెక్టరేట్‌లో ఆర్ఎస్ఎఫ్ నాయకులు డిఆర్వోకు వినతి పత్రం సమర్పించారు. ఆర్ఐఓ వెంకటేశ్వర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని డి.యం. ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఇంటర్ కాలేజీలు నిబంధనలు ఉల్లంఘిస్తూ, అనుమతి లేకుండా నడుస్తున్నాయని, హాస్టల్ నిర్వహణ కూడా నిబంధనలకు విరుద్ధమని, మౌలిక వసతులు లేకుండా అపార్ట్మెంట్లలో కాలేజీలు నడుస్తున్నాయని విమర్శించారు. ఈ అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్