ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనలో భాగంగా ఫిబ్రవరి 2న నిర్వహించనున్న “సంపూర్ణతా అభియాన్ - 2.0”ను అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, సేవలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.