కడప గడ్డి బజార్‌లోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో నిజ జేష్ఠ మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా జరిగాయి. ఈ పుణ్య దినాన్ని పురస్కరించుకుని ముందుగా లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి ఉత్సవ మూర్తులకు ఆలయ వంశపారంపర్య అర్చకులు విజయ్ బట్టర్ స్వామి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు.