మహిళల రక్షణకు 'శక్తి' యాప్: కడపలో అవగాహన కార్యక్రమం

228చూసినవారు
మహిళల రక్షణకు 'శక్తి' యాప్: కడపలో అవగాహన కార్యక్రమం
వైఎస్సార్‌ కడప జిల్లా, కడప టౌన్‌లో గురుకుల విద్యాపీఠ్ స్కూలులో మహిళలు, బాలికల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 'శక్తి' యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్ రెడ్డి, కానిస్టేబుల్ రాజారెడ్డి, మహిళా కానిస్టేబుల్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, యాప్ ఉపయోగం, సేవలు, రిజిస్ట్రేషన్ గురించి విద్యార్థినులకు విస్తృతంగా వివరించారు. ఈ యాప్ ఆపద సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్