వైఎస్సార్ కడప జిల్లాలో గల యోగి వేమన విశ్వవిద్యాలయం, జన్యు శాస్త్ర పరిశోధక విద్యార్ధి షేక్ బాబుల్లాకు జన్యు శాస్త్ర విభాగంలో డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఆచార్య ముని కుమారి పర్యవేక్షణలో, 'సోలానమ్ లైకోపెర్సిసిమ్ ఎల్. సివి. అర్కా వికాస్ యొక్క మెరుగైన మొక్క పెరుగుదల మరియు వృక్ష రోగకారక నిరోధం కోసం హరిత పద్ధతిలో సంశ్లేషణ చేయబడిన బహుళ-పోషక నానోపార్టికల్ కన్సార్టియాల రూపకల్పన మరియు మూల్యాంకనం' అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు ఈ గౌరవం లభించింది. ఈ పరిశోధన పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి.