కడప జిల్లా బద్వేలు పోలీస్ స్టేషన్ ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించిన ఆయన, స్టేషన్ లో సిబ్బంది కొరతపై దృష్టి సారించారు. సిబ్బంది కొరతను పరిష్కరిస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు. పాడైపోయిన పోలీస్ క్వార్టర్స్ గురించి ఆరా తీశారు. డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని ఎస్పీ తెలిపారు.