కడపలోని శ్రీ విజయదుర్గమ్మ ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున పంచామృతాభిషేకం, మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు రాహుకాల పూజలు వైభవంగా జరిగాయి. వివాహ, సంతాన, జాతక దోషాలు ఉన్నవారు 11, 21 లేదా 41 వారాల పాటు ఈ పూజ చేసి నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏప్రిల్ 2 పౌర్ణమి రోజున ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, చండీహోమం నిర్వహించనున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు.